Thursday, February 24, 2011

Interview with Rohini Raghuvaran



నటి రోహిణి పేరు చెప్పగానే చాలా మంది తెలుగు ప్రేక్షకులు గుర్తు పట్టలేకపోవచ్చు. కాని ఆమె గొంతు గుర్తుపట్టని వారు మాత్రం కొద్ది మందే ఉంటారు. "లేచి పోదామా" అని కవ్వించే గీతాంజలి నాయిక గొంతు, "చాయ్ పిలాతే" అనే "శివ" నాయిక గొంతు రోహిణి  గారిదే. బాలనటిగా సినీపరిశ్రమలో అడుగుపెట్టిన రోహిణి గారు తర్వాత కొన్ని సినిమాల్లో కథా నాయిక పాత్రల్లో నటించి, ఒక తెలుగు చిత్రం ద్వారా జాతీయ అవార్డు కూడా గెలుచుకున్నారు. గీతాంజలి సినిమా మీద వ్యాసం రాసినప్పుడు ఆమె కాంటాక్ట్ నంబర్ దొరకలేదు. ఇన్నాళ్ళకు "అలా మొదలయ్యింది" చిత్రంలో "నాని" తల్లి పాత్రలో ఆవిడని చూశాక దర్శకురాలు నందిని గారి దగ్గర ఆవిడ నంబర్ తీసుకొని ఇంటర్వ్యూ చేయగలిగాను. ఆ విశేషాలు మీ కోసం...
శ్రీ: మొట్టమొదట తమిళనాడు ప్రభుత్వం ఇచ్చే ప్రతిష్టాత్మకమైన "కలైమామణి" అవార్డు పొందినందుకు అభినందనలు.
రోహిణి:
థాంక్సండీ. ఆ అవార్డొస్తుందని నేనస్సలు ఊహించలేదు.

శ్రీ: మీరు  సినిమాల్లోకి ఎలా వచ్చారో చెప్పండి.
రోహిణి:
మా నాన్నగారికి సినిమాలంటే మొదట్నుండీ ఆసక్తి. మాది వైజాగ్. నాకు నాలుగేళ్ళ వయసులో అమ్మ పోవడంతో మకాం చెన్నై కి మార్చాం. సినిమాల మీద ఆసక్తితో నాన్న స్టూడియోలు తిరుగుతుంటే నేనూ వెంటవెళ్ళేదాన్ని. అలా స్టూడియోలో నన్ను చూసి బాలనటిగా అవకాశమిచ్చారు . నాన్నకూ ఇష్టమే కాబట్టి ఏ ఇబ్బందులు లేకుండానే నటించేశాను .


శ్రీ: బాలనటిగా మీ మొదటి సినిమా జ్ఞాపకాలేవైనా మాతో పంచుకోగలరా.
రోహిణి:
లేదండీ నాకస్సలు గుర్తు లేదు. నాకు గుర్తున్నది "యశోద కృష్ణ" చిత్రం నాకు ఐదో సినిమా. బాలనటిగా అనుకుంటా. అప్పట్లో చాలా సినిమాలు చేశాను.

శ్రీ: మీరు టీనేజిలోకి వచ్చాక కూడా చిన్న చిన్న పాత్రలు వేస్తూ వచ్చారు కదా. నాలుగుస్తంభాలాట, ఇల్లాలు లాంటి సినిమాల్లో (ఇల్లాలు సినిమాలో "ఓ బాటసారి, ఇది జీవిత రహదారి" అనే పాట బాగా హిట్టాయ్యింది))
రోహిణి:
అవునండీ చాలానే చేశాను. ఇప్పుడు మాత్రం ఏవో కొన్నే గుర్తున్నాయి,.

శ్రీ: తెలుగు సినిమాల్లో పెద్దగా కథా నాయిక పాత్రలు వేయలేదేందుకని?
రోహిణి:
ఏమోనండి. దర్శకులనడగాలి. నాయిక పాత్రకు నా హైటు సరిపోదని ఒక అభిప్రాయముండేది.



శ్రీ: డబ్బింగ్ రంగంలోకి ఎలా ప్రవేశించారు?
రోహిణి:
నన్నీ రంగంలో ప్రవేశపెట్టింది పాణి గారు. ఆయన నాలుగు స్తంభాలాట సినిమాకి సహాయ దర్శకులు. అప్పుడు షూటింగ్లో నన్ను గమనించారట. గీతాంజలిలో గిరిజ డబ్బింగ్ కోసం ఆర్టిస్టును వెతుకుతుంటే నన్నడగమన్నారట. మొదట నేనూ చేయొద్దనే అనుకున్నాను. కాని మణిరత్నంగారి సినిమాలో చేయాలని ఎప్పటినుండో ఉండేది. సరే ఇదే అవకాశం అనుకొని చేశాను. ఆ ఒక్క సినిమా చేసి మానేద్దామనే ఖచ్చితంగా అనుకున్నాను. లేకపోతే నన్ను సినిమా ఆర్టిస్టు బదులు డబ్బింగ్ ఆర్టిస్టును చేస్తారేమోనని ఒక భయం.


శ్రీ: మరి?
రోహిణి:
గీతాంజలి తర్వాత "శివ" లో అమల పాత్రకు చేయమని రాము అడిగారు. నేనొప్పుకోలేదు. ఒక మూడు రీళ్ళు చూసి నచ్చితే చేయమన్నారు. అది చూసి నచ్చాక అమలకు కూడా డబ్బింగ్ చేశాను. ఆ సినిమా ఎంత హిట్టో తెలిసిందే కదా. ఇక అలాగే కంటిన్యూ చేశాను. దాదాపు అందరు హీరోయిన్లకు డబ్ చేశాను. విజయశాంతికి తప్ప. కొన్ని మంచి సినిమాలు, కొన్ని రొటీన్ సినిమాలు చేశాను. కొన్నాళ్ళకు అన్నీ మానేసి కేవలం నచ్చిన సినిమాలకి మాత్రమే డబ్బింగ్ చేశాను.

శ్రీ: తెలుగులో "స్త్రీ"(1995లో) సినిమాకు నంది అవార్డు, జాతీయ అవార్డు కూడా సాధించారు కదా?
రోహిణి:
అవునండీ. ఆ సినిమాకు జాతీయస్థాయిలో ద్వితీయ ఉత్తమ చిత్రంగా గుర్తింపు వచ్చింది. రజతకమలం ఇచ్చారు. నాకూ స్పెషల్ జ్యూరీ అవార్డిచ్చారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు నంది అవార్డిచ్చింది. ఆ సినిమా పాలగుమ్మి పద్మరాజు గారి "పడవప్రయాణం" కథ ఆధారంగా   మలయాళ దర్శకుడు సేతుమాధవన్ దర్శత్వంలో రూపుదిద్దుకుంది.


శ్రీ: అప్పుడు మిమ్మల్ని ఎయిర్‌పోర్టులో ఒక అభిమానిగా కలిసిన జ్ఞాపకం. (అప్పుడు నేను సాయంత్రం ఫ్లైట్లో చెన్నైకి వెళ్తున్నాను. రోహిణి గారు, రఘువరన్ గారు లాంజ్‌లో నా పక్కనే కూర్చున్నారు. అప్పుడు కాస్త జంకుతో వాళ్ళని పలకరించలేదు. మర్నాడు తిరుగుప్రయాణంలో కూడా అలాగే కలిసినప్పుడు మాత్రం పరిచయం చేసుకొని అవార్డు పొందిన సందర్భంగా అభినందించాను. రఘువరన్ నా వివరాలు కనుక్కున్నారు. హైదరాబాద్‌లో లాండ్ అయ్యాక బైబైలు చెప్పుకొన్నాము)
శ్రీ: మీరు మిగత భాషల్లో కన్నా మలయాళంలో కథానాయికగా ఎక్కువ పాత్రలు చేశారు కదా.
రోహిణి:
అవును అప్పట్లో చాలా మలయాళం సినిమాలు చేశాను. ఒకయేడు ఏకంగా పదహారు సినిమాలు చేశాను. అప్పట్లో మలయాల నటుడు రహ్మాన్, నేనూ మంచి హిట్ పెయిర్. (రహ్మాన్ తెలుగులో  రఘు గా మనకు పరిచయం. చిన్నారి స్నేహం సినిమాలో నాయకుడుగా చేసారు. ఇటీవల సింహా సినిమాలో స్నేహా ఉల్లాల తండ్రిగా కనిపించారు.). అప్పట్లో అందరు పేరొందిన దర్శకుల చిత్రాల్లో చేశాను. జోషి గారు, భరతన్( ఒళివుకళం-1985), పద్మరాజన్ (పరన్ను, పరన్ను, పరన్ను-1984). జోషి గారి దర్శకత్వంలో నాలుగు సినిమాలు చేశాను. తమిళంలో  ఎక్కువగా చేయలేదు. కాని కొన్ని మంచి సినిమాలు చేశాను. భాగ్యరాజ్ గారి దర్శకత్వంలో "పవును పవునుతాన్", బాలుమహెంద్ర దర్శక్త్వంలో "మరుపడియం" (ఇది హిందీ లో మహేష్ భట్, అర్థ్ ఆధారంగా తీసింది). సింగీతం గారి దర్శకత్వంలో మగళిర్ మట్టుం (తెలుగులో ఆడవాళ్ళకి మాత్రమే). కన్నడంలో కేవలం మూడు సినిమాలే చేశాను.

శ్రీ: మీరు తమిళనటులకి కూడా డబ్బింగ్ చెప్పారా?
రోహిణి:
అవునండీ.. జ్యోతిక, టబు, ఐశ్వర్య రాయ్ లకు తమిళంలో చెప్పాను. ఇటీవల రావణ్ చిత్రానికి ఐశ్వర్య కు డబ్బింగ్ చెప్పింది నేనే. (ఫోన్‌లో మాట్లాడుతుంటే, రోహిణి రఘువరన్ల కొడుకు రిషి గొంతు వింపడింది. ఇంటర్వ్యూ  

అయ్యాక చూస్తాను అని రోహిణి సర్ది చెప్తున్నారు).


శ్రీ: మీ అబ్బాయి రిషి ఎలా ఉన్నాడు?
రోహిణి:
తనిప్పుడు ఏడో తరగతి చదువుతున్నాడు. చాల మంచి పిల్లాడు. తను రఘుకు చాలా క్లోజ్. రఘు పోయాక తేరుకోడానికి బాగా కష్టపడ్డాడు. నాకు నలుగురు బ్రదర్స్. వాళ్ళ కూడా ఈ విషయంలో బాగా సహాయం చేశారు.
నాకు ముగ్గురు అన్నలు. ఒక తమ్ముడు. నటుడు బాలాజీ నా బ్రదరే నండి. ఆ మధ్య విజయనిర్మల దర్శకత్వంలో సోల్జర్ అనే సినిమా తీశాడు. త్వరలో ఇంకో సినిమా తీస్తాడు. మిగతావాళ్ళు వైజాగ్‌లో, అమెరికాలో సెటిలయ్యారు.





శ్రీ: చాన్నళ్ళ తర్వాత "అలా మొదలయ్యింది" తో తెలుగు తెరకు వచ్చారు.
రోహిణి:
దానికి మాత్రం పూర్తి బాధ్యత నందినిదే. తనే పట్టుబట్టి చేయించింది. తెలుగు ఇందస్ట్రీ అంతా హైదరాబాదుకి వచ్చేసింది. ఆర్టిస్టులంతా కూడా ఇక్కడికే వచ్చేశారు. నేను చెన్నైలో పెరగడం వల్లా, రిషి కూడా అక్కడే పుట్టి పెరగడం వల్ల నేను అంత తొందరగా రాలేదు. అప్పటికి ఫ్రెండ్స్, ఫామిలీ ఎంతగానో బలవంతం  చేశారు. "అలా మొదలయ్యింది" హిట్టవ్వడం నాకూ సంతోషంగా ఉందండి. పాపం నందిని ఈ సినిమాకోసం చాలా కష్టపడింది.

శ్రీ: తర్వాత ఏం చేద్దామనుకుంటున్నారు?
రోహిణి:
దర్శకత్వం చేపట్టాలనుంది. మూడు కథలు రాసుకున్నాను. స్క్రీన్‌ప్లే కూడా పూర్తవ్వస్తోంది. ఈ సంవత్సరమే మెగాఫోన్ పట్టుకుంటానేమో. బహుశా తమిళంతో. ఇంకా చర్చలు నడుస్తున్నాయి. తొందర్లోనే మీ





No comments:

Post a Comment